దరఖాస్తుకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో ఓటీపీ కష్టాలు ఎదురయ్యా యి. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో ఓటీసీ సమస్యలతో అర్హులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోర్టల్ సమస్యతో ఓటీపీ పక్రియ నిలిచిపోయింది. మొబైల్ ఫోన్‌లకు ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో ఆన్‌లైన్ నమోదులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయాల వద్ద గంటల తరబడి వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు ఎదుర్కొన్నారు. సర్వర్‌లు మొండికేయడంతో వేలాది మంది అర్హులు గడువులోపు దరఖాస్తులు చేసుకోలేక నిరాశగా వెనుదిరిగారు.


