చిత్తూరు కలెక్టరేట్: నగరంలోని ఆర్యవైశ్య వీధిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ఇంట్లో విద్యుత్ సమస్య కారణంగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్రిజ్, టీవీ, ఇంటి పైకప్పు, ఫ్నరిచర్, 40 గ్రాము ల బంగారం, 500 గ్రాముల వెండి కాలిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు అంచనా వేశారు. సకాలంలో స్పందించడంతో దాదాపు రూ.20 లక్షల విలువైన ఆస్తిని రక్షించగలిగారు. ఈ ఘటన పై అగ్నిమాపకశాఖాధికారులు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారు.


