ఎలక్ట్రిక్‌ సైకిళ్ల పంపిణీలో ‘రికార్డు’ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ సైకిళ్ల పంపిణీలో ‘రికార్డు’

Sep 19 2026 5:56 AM | Updated on Sep 19 2026 5:56 AM

కుప్పం : కుప్పం నియోజకవర్గంలో ఒక్కరోజులోనే అత్యధికంగా 3,742 ఎలక్ట్రిక్‌ సైకిళ్ల పంపిణీ చేసినందుకు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు దక్కింది. శుక్రవారం ఈ మేరకు కాన్పూర్‌ ఐఐటీ ప్రతినిధి హరి శంకర్‌ చేతులమీదుగా గిన్నిస్‌ బుక్‌ రికార్డు సర్టిఫికెట్‌ను కలెక్టర్‌ సుమి త్‌ కుమార్‌ అందుకున్నారు. ఈఏడాది జనవరి 31వ తేదీన కుప్పం నియోజకవర్గంలో 3,742 ఎలక్ట్రిక్‌ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించినట్లు అధికారులు తెలిపారు.

ఐటీఐలో 6వ విడత అడ్మిషన్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో 6వ విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు జిల్లా కన్వీనర్‌ రవీంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న సీట్లను 6వ విడత లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు లు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 6302634177, 9440738121 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

అక్టోబర్‌ 9న

ఓటర్ల తుది జాబితా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నిర్వహించిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌ 9వ తేదీన ప్రచురించనున్నారు. జిల్లాలో మొత్తం 1,34,307 మందికి నోటీసులు పంపిణీ చేయగా 100 శాతం విచారణ పూర్తి చేశారు. ఓటరు కార్డుల ఫొటోలకు సంబంధించి 10,51,000 మందిలో 8.4 లక్షల మంది ఫొటోలను బీఎల్‌ఓలు అప్‌డేట్‌ చేశారు. ఇందులో 5 లక్షల మందికి సంబంధించిన వివరాలను ఈఆర్‌ఓలు ఆమోదించారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రస్తుతం ఫారమ్‌–6 దరఖాస్తులు 7,600 , ఫారమ్‌–7 దరఖాస్తులు 430, ఫారమ్‌– 8 దరఖాస్తులు 4,100 పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు.

డిప్యూటేషన్‌పై బదిలీ

చిత్తూరు కార్పొరేషన్‌ : స్వర్ణ గ్రామం ఇంజినీరింగ్‌ సహాయకులు ఆరుగురిని డిప్యూటేషన్‌పై సమగ్రశిక్షకు బదిలీ చేస్తూ పీఆర్‌ఐ ఈఈ నవీన్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్రశిక్ష పరిధిలో మనబడి–మన భవిష్యత్‌ కింద చేపడుతున్న సివిల్‌ పనుల పర్యవేక్షణకు వీరిని నియమించారు. అరాఫత్‌ (గొల్లచీమనపల్లె, బైరెడ్డిపల్లె), అపర్ణ (చింతలగుంట, చిత్తూరు మండలం), నిరోషా (పెరయ్యగారిపల్లె, ఐరాల), గురుప్రకాష్‌ (డీఎంపురం, కార్వేటినగరం), విద్య (గ్యారంపల్లె, పెనుమూరు), దివ్యభారతి (పాలకూరు, పూతలపట్టు)ని సమగ్రశిక్షకు నియమించారు. వీరు త్వరలోనే విధుల్లో చేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement