చిత్తూరు కార్పొరేషన్ : దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజినీ ర్స్ అసోసియేషన్ వారు చిత్తూరు ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహనికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ రంగానికి మార్గదర్శకుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు దేశ ని ర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. గతంలో నిర్మించిన అనేక ఆనకట్టలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళికలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయని వివరించారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణలు, నాణ్యమైన నిర్మాణాలకు కృషి చేయాలని సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎస్‌ఈ కార్యాలయంలో..
ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఎస్‌ఈ అమర్‌బాబు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఓ రెడ్డప్ప, ఏఈ జ్యోతి పాల్గొన్నారు.


