క్షణ క్షణం.. చిరుత భయం | - | Sakshi
Sakshi News home page

క్షణ క్షణం.. చిరుత భయం

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగర పరిసర ప్రాంతాలను చిరుత పులి భయం వెంటాడుతోంది. చెన్నమ్మగుడిపల్లె, ఎగువమాసాపల్లె, దిగువమాసాపల్లె ప్రాంతాల్లో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందన్న వార్త స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అటవీశాఖ అధికారులు డ్రోన్‌ కెమెరాల ద్వారా పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. మరోవైపు చెన్నమ్మగుడిపల్లె ప్రాథమిక పాఠశాల వద్ద చిరుత కదలికలను గుర్తించారు. దీంతో విద్యార్థులను బడి దూరంగా గుడి వద్ద పాఠాలు బోధిస్తున్నారు.

వ్యక్తి మృతదేహం గుర్తింపు

వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్‌ సమీపంలోని పొలంలో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులోని ఆధారాల మేర కు కార్వేటినగరం మండలం పద్మసరస్సుకు చెందిన గురవ య్య మందడిగా గుర్తించినట్లు ఎస్‌ఐ హరీష్‌ తెలి పారు. నాలుగు రోజుల క్రితం పూడిలో జరిగిన ఓ కార్యక్రమానికి గురవయ్య వచ్చినట్లు తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నా రు. నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో దుర్వాసన రావడం వల్లే గ్రామస్తులు సైతం గుర్తించి సమాచారం అందించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇద్దరు హెచ్‌ఎంలకు నోటీసులు

చిత్తూరు కలెక్టరేట్‌ : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు నో టీసులు జారీ చేసినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్ల తో మా ట్లాడారు. నగరి మండలం ఏకాంబరకుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నమశ్శివాయ, పలమనేరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల హెచ్‌ఎం షంషీర్‌కు నోటీసు లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

రామకుప్పం(శాంతిపురం) : కుప్పం– పలమనేరు జాతీయ రహదారిపై చెల్దిగానిపల్లె వద్ద శుక్రవారం ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. శుక్రవారం భారీ వినాయక విగ్రహం తరలింపుతో చెల్దిగానిపల్లె వద్ద విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి. రెస్కో సిబ్బంది మరమ్మతు పనులు చేస్తుండటంతో వి.కోట వైపు నుంచి వచ్చిన రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి రోడ్డుపై ఆగాయి. ఈ క్రమంలో ముందు లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. దీంతో క్యాబిన్‌ లారీ డ్రైవర్‌ రాజేంద్రన్‌(37) ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు అతి కష్టం మీద వెలికి తీశారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలో పలువురికి పార్టీ పదవులు

సాక్షి,చిత్తూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలను పలు కీలక పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా టి.గోవిందన్‌ (చిత్తూరు), జిల్లా వి ద్యార్థి విభాగం కార్యదర్శిగా బి.సోమరాజు (పలమనేరు), జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.లక్ష్మీనారాయణ (పలమనేరు), జిల్లా యువ త విభాగం కార్యదర్శిగా ఎస్‌.శరత్‌(చిత్తూరు), పుత్తూరు రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్‌ యాదవ్‌ (నగరి) నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement