స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం ● చంద్రబాబు– కరువు కవల పిల్లలు ● జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి

కార్వేటినగరం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు పృథ్వీరెడ్డితో కలిసి పుత్తూరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నాయకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అధికార గర్వంతో రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేసి జీడీనెల్లూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాలపై వైఎస్సార్‌ సీపీ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కరువుకు మానస పుత్రుడు చంద్రబాబు అని, కరువు, చంద్రబాబు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. 1993 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాల్లో 1400 మండలాలు ఉండగా అందులో 1200 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు అని, అలాగే చిత్తూరు–తిరుపతి ఉమ్మ డి జిల్లాలో 67 మండలాలు ఉండగా బాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు మండలాలుగా ప్రకటించాడని గుర్తు చేశారు. 2014లోనూ వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకి పోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభావంతోనే వర్షాలు కురవడం లేదన్నారు. 120 ఏళ్ల క్రితం డొక్కల కరువు (గంజికరువు) వచ్చిందని, ఇప్పుడు మళ్లీ డొక్కల కరువు వచ్చిందని తెలిపారు. మూడేళ్లపాటు రాష్ట్రం కరువుతో అల్లాడక తప్పదన్నారు. వాతావరణ శాఖ అధికారులు చంద్రబాబు పాలన వల్ల వర్షాలు రావు చెప్పకుండా ఎల్‌నినో ప్రభావం అంటూ ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని గుర్తు చేశారు. గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ జగనన్న పాలన కోసం ఒక సైనికుడిలా పోరాటం చేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.

అభ్యర్థుల ఎంపికలో ఆ పంచాయతీ వారే కీలకం

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికల్లో ఆయా పంచాయతీ నాయకులే కీలకమని, ఒక పంచాయతీలో మరో పంచాయతీ నాయకులు జోక్యం చేసుకోకూడదని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో ఒక సైనికుడిలా పని చేసి ఆ పంచాయతీ కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయడానికి సిద్దం ఉండాలన్నారు. ఆ పంచాయతీ నాయకులు, కార్యకర్తల నిర్ణయమే పార్టీ అధిష్టానం నిర్ణయమని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.

సర్పంచుల విజయంతోనే

అసెంబ్లీ అభ్యర్థుల విజయాలు

స్థానిక ఎన్నికల్లో పోటే చేసే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయాలే రానున్న ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాలని జీడీనెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి అన్నా రు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను గ్రామస్థాయిలో ఎండగట్టి మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.

ఓటర్లకు వెన్నుదన్నుగా నిలవాలి

రాష్ట్రంలోనే వైఎస్సార్‌ సీపీకి బలమైన నియోజకవర్గం జీడీనెల్లూరు అని, ప్రతి పంచాయతీలోను మన అభ్యర్థి గెలవాలని జీడీనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు ఫృథ్వీరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అండగా ఉంటుందని నాయకులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్లు శేఖర్‌రాజు, వెంకటరెడ్డి, మణి, విజయకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ అన్బలగన్‌, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చందురాజు, ద్రాక్షాయణి, మాజీ మండల కన్వీనర్‌ ధనంజయవర్మ, వైస్‌ ఎంపీపీ కార్తీక్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ధనశేఖర్‌యాదవ్‌, మునికృష్ణ, నందగోపాల్‌, కోలార్‌ ప్రకాష్‌, రామయ్య, శివాజీ, సురేంద్రరెడ్డి, వెంకటేష్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, కుప్పయ్య, జనార్ధన్‌, శ్యామ్‌, మదివాణన్‌, రమాదేవి, దూది మోహన్‌, లోకేష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement