బాధ్యతాయుతంగా విధులు | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

● స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఎస్పీ తుషార్‌ డూడీ

11 నుంచి లెప్రసీ సర్వే

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు ఈ నెల 11 నుంచి 24 వరకు లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్పర్శ లేని మచ్చలు ఉన్న వారిని గుర్తించి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. పాఠశాల ల్లో విద్యార్థులకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ నాగ శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి శాపం కాదని, సరైన చికిత్సతో నయం చేయవచ్చని తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిక్కచ్చిగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా ప్రక్రియ దాదాపు 99.9 శాతం పూర్తయిందని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశమున్న కేంద్రాలను ముందుగానే గుర్తించాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, ప్రత్యామ్నాయ పవర్‌ బ్యాకప్‌ సిద్ధం చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ నామినేషన్ల కోసం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, కంప్యూటర్లు, అవసరమైన చోట మొబైల్‌ హాట్‌స్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలపై అధికారులు, సిబ్బందికి మాస్టర్‌ ట్రైనర్లతో సమగ్ర శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.

ప్రత్యేక భద్రతా ప్రణాళిక

ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌, కౌంటింగ్‌ ఇలా ప్రతి దశకూ ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ఎవరి ప్రభావానికై నా లోనైనా సహించేది లేదని హెచ్చరించారు. డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసే తాజా మార్గదర్శకాల ను అధ్యయనం చేయాలని సూచించారు. పంచా యతీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, గోప్యత, భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌డీఓ శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ పాల్గొన్నారు.

పర్యాటకాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అర్ధగిరి, పులిగుండు ఆలయాల వద్ద డీడీసీ నిధులతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గంగినేని, భూమిరెడ్డిపల్లి, బుడితిరెడ్డిపల్లి చెరువుల్లో బోటింగ్‌ సౌకర్యాలు పునరుద్ధరించాలని సూచించారు. డీఆర్‌ఓతోపాటు పర్యాటక 11 నుంచి లెప్రసీ సర్వే

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు ఈ నెల 11 నుంచి 24 వరకు లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్పర్శ లేని మచ్చలు ఉన్న వారిని గుర్తించి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ నాగ శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి శాపం కాదని, సరైన చికిత్సతో నయం చేయవచ్చని తెలిపారు. అధికారి నరేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.

హాజరైన అధికారులు

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement