చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని నగరి, బలిజకండ్రిగ, కుప్పంలో 6 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లును ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు ఆదేశించారు. మంగళవారం ఎస్‌ఈ కార్యాలయంలో ఎంఆర్‌టీ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ఎస్‌పీఎంలలో ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ ఉంచుకోవాలని సూ చించారు. నిబంధనల ప్రకారం రెండు రోజు ల్లో పాడైన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతు చేయాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వాడకం పెరిగిందని చెప్పారు. అనంతరం చిత్తూరులోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించారు. ఓఆర్‌ఎం పనితీరు ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ బాబు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.19.13 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లావ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ద్వారాఆదా యం లక్ష్యం రూ.20.02 కోట్లకు గాను రూ.19.13 కోట్లు వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. మంగళవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. మేలో రూ.20.02 కోట్లు లక్ష్యం కాగా, రూ.13.33 కోట్లు, జూన్‌లో రూ.17.74 కోట్లు లక్ష్యం కాగా, రూ.17.97 కోట్లు, జూలైలో రూ.20.07 కోట్లకుగాను రూ.17.58 కోట్ల ఆదా యం వచ్చినట్లు వివరించారు.
వంద శాతం
ఉత్తీర్ణతకు ప్రణాళిక
నగరి : విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించాలని డీఈఓ కె.లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం నగరి మండలంలోని పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు ఇంగ్లిష్, సోషియల్ కీ వర్డ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఏకాంబరకుప్పం జెడ్పీ హైస్కూ ల్‌లో హిందీ టీచర్ గైర్హాజరుపై మండిపడ్డారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఎంఈఓ–2 నమశ్శివాయ పాల్గొన్నారు.


