చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు | - | Sakshi
Sakshi News home page

చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దు

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

– మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం

వెదురుకుప్పం: పేదలకు సంక్షేమ పథకాలు అమలుచేయకుండా, గ్రామాలను అభివృద్ధి చేయకుండా మోసా లు, అబద్ధాలతో పాలన సాగిస్తున్న చంద్రబాబు చరిత్ర హీనులుగా నిలిచిపోతారని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తా రు. ఆయన బుధవారం బందార్లపల్లెలో విలేకరులతో మాట్లాడు తూ వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తుడా పరిధి నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మారుమూల ప్రాంతాలను అన్నివిధాలా చేయాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తుడా పరిధిలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతామని చంద్రబాబునాయు డు హామీ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నెరవేర్చకపోగా వాటిని తుడా పరిఽ ది నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే భవిష్యత్తులో పేదలను భిక్షగాళ్లుగా చేస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలుచేసిన నవరత్నాల పథకాల స్థానంలో రెండింతలు ఇస్తా మని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకా లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పేద వాడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కరువయ్యా యని తెలిపారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150కి పైగా పాఠశాలలు మూతపడినట్లు చెప్పారు. పెనుమూరు మండలంలో కలవకుంట జలాశయం అభివృద్ధి అటకెక్కిందని, వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణం అతీగతీ లేదన్నారు.

తుడా నుంచి తొలగించి దెబ్బతీశారు

కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తుడా పరిధి నుంచి తొలగించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్‌ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేశ్‌ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఏ ఒక్క పనీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను సైతం దూరం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్పార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, బూత్‌ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాధవరాావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ మునిచంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, ఎస్సీ విభాగం మండల కార్యదర్శి మురళి, సింగిల్‌ విండో మాజీ డైరెక్టర్‌ మునికృష్ణారెడ్డి, సోషల్‌ మీడియా విభాగం మండల అధ్యక్షుడు దేవరాజులు రెడ్డి, మాజీ ఎంపీటీసీ రోశిరెడ్డి, మాజీ సర్పంచ్‌ రామచంద్రారెడ్డి, బొజ్జారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement