చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో కానిస్టేబుళ్లకు ఇస్తున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం తనిఖీ చేశారు. ఆయుధ వినియోగ నైపుణ్యాలు, పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులు అవుతున్నారు, శిక్షణ ఎలా పొందుతున్నారని అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఆయుధాల వినియోగం కీలకమని, క్రమశిక్షణ, అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆయుధాలు చేతబట్టిన ప్రతి సందర్భంలోనూ అప్రమత్తత అవసరమన్నారు. ప్రజలతో మంచిగా వ్యవహరిస్తూ పోలీసుశాఖ పట్ల గౌరవాన్ని పెంచాలని సూచించారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఎంటీవో వీరేష్ సిబ్బంది ఉన్నారు.
కమాండ్ కంట్రోల్ పరిశీలన
చిత్తూరులోని పోలీసు కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ వ్యవస్థను ఎస్పీ పరిశీలించారు. అత్యవసర వేళల్లో ఫోన్‌కాల్స్ అందుకుంటున్న పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఎంత సమయంలో బాధితులను చేరుకుంటున్నారు? సీసీ కెమెరాల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్య పర్యవేక్షణ, శక్తియాప్‌పై ఎలా స్పందిస్తున్నా? లాంటి విషయాలను ఆరా తీశారు. అనంతరం విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్‌ఐ మోబీన్‌తాజ్ సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.


