– 8లో
గుడిపాల మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రైతులు ఎంపీడీవోకు ఫిర్యాద చేశారు.
నేడు జిల్లాకు ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకుల రాక
చిత్తూరు కలెక్టరేట్: ఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి మల్లికార్జున్ గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఆయన ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారని వివరించారు.
డైట్ ప్రిన్సిపాల్‌గా విజయేంద్రరావు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) కళాశాల ప్రిన్సిపాల్‌గా విజయేంద్రరావును నియమించినట్లు సమా చారం. గతంలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమ ణ చేశారు. ఈ క్రమంలో సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా సి.విజయేంద్రరావును కార్వేటినగరం డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించినట్టు తెలిసింది. విజయేంద్రరావు గతంలో చిత్తూరు జిల్లా విద్యా శాఖ అధికారిగా పనిచేశారు.


