4,500 కేజీల తమిళ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

4,500 కేజీల తమిళ బియ్యం స్వాధీనం

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

● సెల్‌ఫోన్‌లో లీనమైన తల్లి ● ఆడుకుంటూ కిండ పడిన బాలుడు ● తీవ్రంగా గాయపడి మృత్యువాత

గుడిపాల: తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 4500 కేజీల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బొమ్మసముద్రం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన మినీ కంటైనర్‌ వ్యాన్‌ డ్రైవర్‌ పోలీసులను చూసి పారిపోయాడని తెలిపారు. వాహనంలో పరిశీలించగా అందులో 4500 కేజీల (90 బ్యాగులు) తమిళనాడు బియ్యం ఉందని తెలిపారు. తమిళనాడు బియ్యా న్ని రాణిపేటకు చెందిన లోకేష్‌ అను వ్యక్తి తీసుకుపోతున్నట్లు తెలిసిందన్నారు. తొందరలోనే అత న్ని పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

మిద్దైపె నుంచి పడి

బాలుడు మృతి

బైరెడ్డిపల్లె : మండల కేంద్రమైన బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో బుధవారం సాయంత్రం మిద్దైపె నుంచి బాలుడు పడి మృతి చెందాడు. మండలంలోని మేకలనాగిరెడ్డిపల్లెకు చెందిన లక్ష్మణరెడ్డి భార్య, పిల్లలతో కలిసి బైరెడ్డిపల్లె ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో కాపురముంటున్నారు. బుధవారం సాయంత్రం లక్ష్మణ్‌రెడ్డి భార్య స్వప్న ఇంటి మిద్దైపెకి వెళ్లి సెల్‌ఫోన్‌లో లీనమైపోయింది. తల్లి వద్దకు వచ్చిన రెండో కుమారుడు భానురెడ్డి (3) మిద్దైపె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో బైరెడ్డి పల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్క డి నుంచి మెరుగైన చికిత్స కోసం కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఎస్సీ యువతకు అర్హతలకు అనుగుణంగా అవకాశాలు

చిత్తూరు కలెక్టరేట్‌: చిత్తూరు, తిరుపతి జిల్లాలో ని ఎస్సీ యువత తమ అర్హతలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న లబ్దిని పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్‌ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్‌ చిత్తూరు కార్యనిర్వహక సంచాలకులు శ్రీదేవి తెలిపారు. సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలు, రుణ సదుపాయాలు, సబ్సి డీ పథకాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకా శాల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు ఈవోపీ జ్యోతి 9550762919, ఏఈవో కే మేఘనాథ్‌ 9959403234, డీపీవోఎస్‌ గిరీష్‌ 8074437025, డీఈవోఎం శ్రీనాథ్‌ 8686149492, డీవోవోపీ ప్రశాంత్‌ 9966079699ను సంప్రదించాలన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ aprccorporation.ap.gov.in ను చూడాలని సూచించారు.

టెన్త్‌ విద్యార్థులకు

ప్రత్యేక తరగతులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సీ, డీ గ్రేడ్‌ పిల్లలు మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గుడిపాల మండలంలోని కమ్మతిమ్మపల్లి ప్రాథ మిక పాఠశాలలో ఒక విద్యార్థి, ఒక టీచర్‌ ఉండటంతో వారిని సమీపంలోని 197 రామాపురం పాఠశాలకు మార్చామన్నారు. విద్యార్థికి ప్రభుత్వం తరఫున రవాణాభత్యం అందజేస్తామన్నారు. జిల్లాలోని గుడిపాల మండలం వెంగంవారిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వివరాలను అధికారికంగా సమీపంలోని ఏఎల్‌పురం మోడ ల్‌ ప్రైమరీ పాఠశాలకు మార్పు చేసినట్టు తెలిపా రు. కొన్ని సమస్యల వల్ల విద్యార్థులు వెంగంవారిపల్లి పాఠశాలలోనే తరగతులకు హాజరవుతారని డీఈవో వెల్లడించారు.

తిరుమలలో

బీడీ తాగిన వ్యక్తిపై కేసు

తిరుమల : తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. తిరుమల వరాహస్వామి కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో బహిరంగంగా బీడీ తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోను పోలీసులు పరిశీలించారు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం జిల్లా పళనిపేటకు చెందిన ఆర్‌.సంతోష్‌ (31)ను నిందితుడిగా గుర్తించారు. అతన్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, టీటీడీకి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో మద్యం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం నిషేధమని పోలీసులు తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement