నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సమస్యల పై వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలని ఆయన సూచించారు.

నేడు పోలీసు

కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చని, ఉదయం 10.30 నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ పేర్కొన్నారు.

కళాకారులు

దరఖాస్తు చేసుకోండి

కాణిపాకం: శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 4వ తేదీ వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం దేవస్థాన ఆస్థాన మండపంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలూ లేకుండా దిగ్విజయంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాల్లో భాగస్వాములై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలనుకునే కళాకారులు తమ దరఖాస్తులను దేవస్థాన కార్యాలయానికి పంపాలని అధికారులు సూచించారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల ఆఖరి తేదీగా నిర్ణయించారు. తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తులనూ స్వీకరించబోరని స్పష్టం చేశారు.

గౌతు లచ్చన్నకు

పోలీసుశాఖ నివాళి

చిత్తూరు అర్బన్‌: దేశ స్వాతంత్య్రంతో పాటు రైతు–కూలీల సంక్షేమం కోసం పోరాటం చేసిన గౌతు లచ్చన్నను స్మరించుకోవడం అందరి బాధ్యత అని చిత్తూరు పోలీసుశాఖ ఏఆర్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. లచ్చన్న 117వ జయంతి నేపథ్యంలో ఆదివారం చిత్తూరులోని పోలీసు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో గౌతు లచ్చన్న చిత్రపటానికి పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్‌ఐ సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement