మళ్లీ తమ్ముళ్లకే కిక్కు? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తమ్ముళ్లకే కిక్కు?

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్‌ వైపు సర్కారు చూపు వచ్చే నెలతో ముగియనున్న 113 దుకాణ లైసెన్సుల గడువు ఇప్పుడున్న లైసెన్సుదారులకే రెండేళ్ల పాటు పొడిగింపు? 90 శాతానికి పైగా దుకాణాలు టీడీపీ నేతల చేతుల్లోనే టెండర్లు లేకుండా.. లక్కీడిప్‌ లేయకనే మద్యం లైసెన్సులు

చిత్తూరు అర్బన్‌: మద్యం కిక్కు మరో రెండేళ్ల పాటు తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏర్పాటైన ఉప సంఘ కమిటీ మద్యం దుకాణాల లైసెన్సునులను ఇప్పుడున్న వ్యాపారులకు 2029 వరకు పొగిడిస్తే మంచిదని ప్రభుత్వానికి సూచించడంతో.. జిల్లాలో 113 మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సర్వం సిద్ధమైంది.

దరఖాస్తు లేదు.. డిప్పు ఉండదు

జిల్లాలో 2024 గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన మద్యం దుకాణాల లైసెన్సుల ప్రక్రియలో నాన్‌–రీఫండబుల్‌ దరఖాస్తు రుసుము కింద మాత్రమే ప్రభుత్వానికి రూ.45 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక నెలకు మద్యం విక్రయాల దాదాపు రూ.70 కోట్లు, లైసెన్సు ఫీజుల ద్వారా దాదాపు రూ.133 కోట్ల ఆదాయం లభించింది. పర్మిట్‌ గదుల పేరిట రూ.3 కోట్లు అధనపు ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం దరఖాస్తులే చేసుకోకుండా, లక్కీడిప్‌ వేయకుండా ఏకపక్షంగా దుకాణాలను పాత లైసెన్సులకే కట్టబెట్టడానికి నిర్ణయం తీసేసుకున్నారు.

నష్టం లేని వ్యాపారం

నష్టాలు చవిచూడని వ్యాపారం, వాస్తుతో అవసరం లేకుండా రూ.కోట్లు కుమ్మరించే వ్యాపారం ఏదైనా ఉందా..? అంటే ఒక్క మద్యం వ్యాపారం మాత్రమే. ఇందులో నష్టపోయామని ఏ ఒక్కరూ చెప్పే పరిస్థితేలేదు. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే లాభాలు 14 శాతం, ఇక ఎమ్మార్పీ ఉల్లంఘించడం, సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో ఏ ఒక్క వ్యాపారిని నష్టాల ఊబిలో పడేసినట్లు దాఖలులేదు. అయినా సరే వీళ్లకే మరో రెండేళ్ల పాటు లైసెన్సులు రెన్యూవల్‌ చేయడానికి రంగం సిద్ధమవడం. ఈ రంగంలోకి వెళ్లాలనుకునే వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే 2028 అక్టోబర్‌ వరకు కొత్త వ్యాపారులకు మద్యం దుకాణాల లైసెన్సులను తీసుకోవడంలో ప్రవేశం నిషిద్ధం అన్నమాట..!

ప్రైవేటుకు దారులు

గత ప్రభుత్వ హయంలో దుకాణాల నిర్వహణ మొత్తం అప్పటికే ప్రభుత్వమే చూసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలకు తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఉపాధి చూపించే వనరులుగా మార్చేసి, మళ్లీ ప్రైవేటు మద్యం దుకాణాలకు తెరతీసింది. 2024 అక్టోబర్‌లో జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సులను కేటాయించింది. ఆపై 50 శాతం లైసెన్సు రాయితీతో 9 దుకాణాలకు కల్లుగీత సామాజిక వర్గాలకు ఇచ్చింది. వీటన్నింటిని లైసెన్సులు వచ్చే నెలతో ముగియనున్నాయి. ఈ తరుణంలో 90 శా తం లైసెన్సులు దక్కించుకున్న అధికార పా ర్టీ నేతలకు లబ్ధి చేకూర్చేలా, రెన్యూవల్‌ పే రిట నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ లెక్కన ప్రభుత్వ ఆ దాయానికి భారీగా గండి పడగా.. తమ్ము ళ్ల కు మంచి ఆదాయ వనరుగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement