సీఎం చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

● కూటమికి ఓటు వేసినందుకు బాబు గుణపాఠం నేరుతున్నారు ● రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం

కార్వేటినగరం: సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మహిళళలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు రెండు వేలు తీసు కుని ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు చెప్పడం బాధాకరమన్నారు. వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. పేదలకు సేవ లు చేసిన వారికి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని, డబ్బులున్నవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన టీచర్లు, రెవెన్యూ అధికారులకు చంద్రబాబు తగిన గుణపాఠం నేర్పుతున్నారని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం నిర్వాహకంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ముగ్గురు ఉపాధ్యా యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం సబబు కాదన్నా రు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నిస్తున్నవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్‌బుక్‌ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. స్కిల్‌స్కాంలో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన జస్టీస్‌ మల్లికార్జునరావుకు ఈ రోజు చంద్రబాబు బహుమానంగా లోకాయుక్తలో నియమించడం దారుణమన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్‌ కోటా కింద పేకాటరాయుళ్లకు ఉద్యోగాలు ఉచ్చారని, నిజమైన అర్హులకు ఉద్యోగాలు అందలేదని, దీనికి బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ రాజీ నామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజు ల్లో మహిళలే చంద్రబాబుకు పంగనామాలు పెడ తారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement