చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు ఈనెల 18 వ తేదీ వరకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈనెల 11 వ తేదీతో సమయం ముగిసింది. కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆశించి న మేరకు అడ్మిషన్లు జరగకపోవడంతో గడువు పొడగించారు. ఈ నెల 18 వ తేదీ వరకు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రత్యేక విభాగం విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో మార్పు చేయలేదు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఈ కసరత్తుకు ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కసరత్తు నిర్వహిస్తున్నారు.
అవయవదానంపై
చైతన్యం పెరగాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సమాజంలో అవయవ, శరీర దానంపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని కాలేజీలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి కోసం వేల సంఖ్యలో రోగులు ఎదురుచూస్తున్నారని, దానంచేసే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం, సమాజానికి ఆదర్శంగా నిలిచి కుటుంబం మొత్తాన్ని శరీర దానానికి అంగీకరించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్.టి. రంగనాథన్‌ను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్ర దానం చేశారు. కార్యక్రమం అనంతరం అపో లో క్యాంపస్ నుంచి మురకంబట్టు సర్కిల్ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అపోలో వర్సిటీ వీసీ డాక్టర్ నితిన్ ఎం. అగార్కర్, ఇతర ప్రతినిధులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
పొగాకు తరలిస్తున్న
వ్యక్తి అరెస్ట్
పుత్తూరు: రైలులో అక్రమంగా పొగాకును రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినటు్‌ల్ పుత్తూరు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కె.పి.సెబాస్టియన్ తెలిపారు. గురువారం తిరుపతి నుంచి చైన్నె వెళ్తున్న ఎంజీఆర్ చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ రవిచంద్రన్ బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద ఉన్న సంచిని పరిశీలించి రూ.3 వేల విలు వైన 05.24 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తుల ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పొగా కును తిరుత్తణికి చెందిన ఆహార భద్రతాధికారికి స్వాధీనపరిచారు. ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారులు నిందితుడికి రూ.25 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.
టెట్‌కు 85.66 శాతం హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్‌కు 85.66 శాతం మంది హాజరైనట్లు డీఈవో లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. టెట్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో గురువారం రెండు సెషన్లలో కలిపి 530 మంది అభ్యర్థులకు 454 మంది హాజరుకాగా 76 మంది గైర్హాజరైనట్లు డీఈవో వెల్లడించారు.
ఏపీఎస్పీ కమాండెంట్‌కు
ఇండియన్ పోలీస్ మెడల్
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని 8వ బెటాలియన్ ఏపీ ఎస్పీ చిత్తూరు కమాండెంట్‌గా వ్యవహరిస్తున్న కె.రామచంద్ర మూర్తికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతిలో సీఎం చేతుల మీదుగా ఈయన పతకాన్ని అందుకోనున్నారు. 1991లో ఆర్‌ఎస్‌ఐగా పోలీస్ శాఖలో నియమితులైన ఈయ న 35 ఏళ్ల పాటు సేవలు అందిస్తున్నారు.


