శిశు విహార్‌ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

శిశు విహార్‌ ఆకస్మిక తనిఖీ

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో కార్యాలయానికి సమీపంలో ఉన్న శిశు విహార్‌ను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, సేవలు, నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దత్తత రికార్డులను, మిషన్‌ వాత్సల్య పోర్టల్‌లో దత్తతకు సంబంధించిన డేటా నమోదు ప్రక్రియను కలెక్టర్‌ స్వ యంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లా డుతూ శిశు విహార్‌ భవనానికి రంగులు వేయడం, విద్యుత్‌ పనులు, కాంపౌండ్‌ వాల్‌ ఎత్తు పెంపు, ఓపెన్‌ కారిడార్‌ పైకప్పుపై ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటు వంటి భద్రతా, అభివృద్ధి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల నిరంతర ఆరోగ్య పరీక్షలకు ప్రత్యేకంగా ఒక పీడియాట్రిషియన్‌ (పిల్లల వైద్య నిపుణుడు)ని ఏర్పాటు చేయాల ని డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగశశిభూషణ్‌ రెడ్డిని ఆదేశించారు. శిశు విహార్‌లోని పిల్లలకు పాల పౌడర్‌ ప్యాకెట్ల కొనుగోలుకు కలెక్టర్‌ నిధుల నుంచి రూ.25 వేలు మంజూరు చేశారు. పిల్లల సంరక్షణ, ఆరోగ్యం వారి సర్వతోముఖాభివృద్ధికి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి, నగరపాలక కమిషనర్‌ నరసింహప్రసాద్‌, పీఆర్‌ ఎస్‌ఈ మల్లికార్జున మూర్తి, డీసీపీవో సుబ్రహ్మణ్యం, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌లు రాధ, శివశంకర్‌, శిశు విహార్‌ మేనేజర్‌ రమ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement