జిల్లా ట్రెజరీలకు వెంటనే నిధులు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లన్నీ క్లియర్ చేయాలి
దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపు మృతుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో నగదు జమ కావాలి
ఆలస్యమైన ప్రతి నెలా కొంత అదనపు సాయం అందించాలి
ట్రెజరీలలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించి, మరణించిన 24 గంటల్లోపు సాయం అందేలా చూడాలి
పెన్షనర్ల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలి
అవస్థల్లో పెన్షనర్ల
కుటుంబాలు
కుప్పం నియోజకవర్గం, శాంతిపురానికి చెందిన ఒక రిటైర్డ్ క్లాస్–4 ఉద్యోగి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. ప్రభుత్వం ఇచ్చే రూ.20 వేల అంత్యక్రియల సాయం కోసం వారు స్థానిక ట్రెజరీ కార్యాలయానికి వెళ్లగా, నిధులు లేవని సమాధా నం వచ్చింది. చివరికి ఊరిలో వడ్డీకి అప్పు తెచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. శ్రీముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చుశ్రీ అని మృతుని కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు.
చిత్తూరు నగరానికి చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మూడు నెలల క్రితం చనిపోయారు. ఆయన భార్య తన భర్తకు రావాల్సిన డెత్ బెనిఫిట్స్ కోసం, అంత్యక్రియల ఖర్చుల కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శ్రీపెన్షన్ పెంచామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, మనిషి చనిపోతే ఇచ్చే కనీస సాయాన్ని ఎందుకు ఆపేసింది?శ్రీ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ సేవలో తరించిన విశ్రాంత ఉద్యోగులకు మరణానంతరం దక్కాల్సిన కనీస గౌరవం కూడా కరువైంది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లు మరణిస్తే వారి కుటుంబాలకు తక్షణ ఊరటగా అందించే ‘అంత్యక్రియల నగదు’ పూర్తిగా నిలిచిపోయింది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఉద్యోగులు మరణిస్తే అదే రోజు సాయం అందించేవారు. అయితే ఇప్పుడు నెలల తరబడి నిరీ క్షించాల్సి వస్తోంది. చిత్తూరు జిల్లాలో వందలాది కుటుంబాలు ఈ సాయం అందక, అప్పులు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాయి. చనిపోయిన వ్యక్తికి ఇచ్చే చివరి గౌరవాన్ని కూడా రాజకీయం చేస్తూ, నిధులు నిలిపివేయడంపై జిల్లా వ్యా ప్తంగా పెన్షనర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఖజానా ఖాళీ
గతంలో పెన్షనర్ మరణించిన వెంటనే, ఆ కుటుంబానికి ఊరటగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం నగదును ట్రెజరీ ద్వారా నేరుగా చెల్లించేవారు. కానీ నేడు జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల చుట్టూ మృతుల వారసులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ‘బడ్జెట్ లేదు.. పై నుంచి నిధులు రాలేదు’ అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
జిల్లా ట్రెజరీ కార్యాలయం
ప్రధాన డిమాండ్లు
అంతిమ యాత్ర నుంచి కర్మ క్రియల వరకు
సంక్షేమం కనుమరుగు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘సంక్షేమం’ అనే పదానికి అర్థమే మారిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి, అధికార పీఠమెక్కాక సామాన్యుడి ప్రాణాలకు, చివరకు మరణానంతర గౌరవానికి కూడా విలువ లేకుండా చేస్తోంది. జీవితాంతం ప్రభుత్వ సేవలో తలమునకలై, విశ్రాంత కాలంలో ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని నమ్మిన లక్షలాది మంది పెన్షనర్లకు నేడు ఘోర అవమానం ఎదురవుతోంది. మనిషి మరణించాక నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాలకు ఇచ్చే అరకొర సాయాన్ని కూడా నిలిపివేసి, ఈ ప్రభుత్వం తన కరుడుగట్టిన అమానవీయతను చాటుకుంటోంది.
ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, మనిషి చనిపోతే ఇచ్చే అంతిమ సాయంపై మాత్రం మొండి చేయి చూపుతోంది. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పెన్షనర్లు నిరుపేదలు. వారు మరణించినప్పుడు కనీసం చితి పేర్చడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే, కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.


