మత ఘర్షణకు ఆజ్యం పోస్తున్న కూటమి | - | Sakshi
Sakshi News home page

మత ఘర్షణకు ఆజ్యం పోస్తున్న కూటమి

Mar 7 2026 8:11 AM | Updated on Mar 7 2026 8:11 AM

– రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధ్వజం

కార్వేటినగరం: శాసన మండలిలో మత ఘర్షణకు నాజ్యం పోస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌ను అవమానపరిచే విధంగా వారి మత ప్రస్తావనను సభలో తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆయన్ను కించపరిచే వింధగా మంత్రి అచ్చంనాయుడు మాట్లాడడం దారుణమన్నారు. వెంటనే అచ్చం నాయుడుని మంత్రి పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ సేవలందించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అడుగడుగునా కక్ష సాధింపు ధోరణిని సాగిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలా మతవిధ్వేషాలు రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు. రామరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేసి జగనన్న పాలన మళ్లీ తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సృజనాత్మకత పెంపునకు

‘లెర్నింగ్‌ విత్‌ జాయ్‌’

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యార్థులు చదువును భారంలా కాకుండా, ఆనందంగా నేర్చుకోవాలని, తద్వారా వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని డీఈవో రాజేంద్రప్రసాద్‌ తె లిపారు. శుక్రవారం తన చాంబర్‌ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠ శాల ఉపాధ్యాయుడు డాక్టర్‌ కె.ఎస్‌.కణ్ణన్‌ రచించిన ‘లెర్నింగ్‌ విత్‌ జాయ్‌’ పుస్తకాన్ని డీఈవో ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక యుగంలో పుస్తక పఠనం ప్రా ముఖ్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లాలోని వి.కోట ఉన్నత పాఠశాలలో సోషల్‌ టీచర్‌గా పనిచేస్తూనే డాక్టర్‌ కె.ఎస్‌.కణ్ణన్‌ ఐదు పుస్తకాలను రచించడం అభినందనీయమన్నారు. ఇది ఒక ఉపాధ్యాయుడు సమాజానికి ఇవ్వగలిగే అదనపు విలువకు నిదర్శనమన్నారు.

‘నిజాయితీ’ నిరూపించుకోవాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా, పారదర్శకమైన వాతావరణంలో నిర్వహించాలని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఆర్‌జేడీ శామ్యూల్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన చీఫ్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ ని ప్రసంగించారు. విధులు నిర్వహించే ప్రతి ఒక్కరి నిజాయితీకి ఏడు రోజు లే పరీక్ష అన్నారు. పరీక్షలు నిర్వహించే ఏడు రోజులు విద్యాశాఖ అధికారుల నిజా యితీకి, అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పరీక్షల విధు ల్లో ఎక్కువగా కొత్త వారికే అవకాశం కల్పించామని, కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య కారణాలు, ఇతర సాకులు చెప్పి పరీక్ష ల విధులను తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే వేటు ఖాయం

విధుల్లో అలసత్వం వహించే ఇన్విజిలేటర్లు, అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాయని ఆర్‌జేడీ హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద మాస్‌ కాపీయింగ్‌ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీఫ్‌ సూపరింటెండెంట్లు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తున్నామన్నారు. జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ జయప్రకాష్‌నాయుడు, చిత్తూ రు డీవైఈవో ఇందిరా, పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు, పలు మండలాల నుంచి ఎంఈవోలు హసన్‌బాషా, రమేష్‌, అరుణాచలరెడ్డి, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement