చిత్తూరు రూరల్ (కాణిపాకం ): ఆరోగ్యానికి పాలు అమూల్యమైన పోషకాహారం. పసిబిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అవసరం. అయితే ఇటీవల జిల్లాలో పాల కల్తీ ఘటనలు పెరుగుతున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు పాలలో ప్రమాదకర రసాయనాలు కలిపి అమ్ముతున్నారనే సమాచారం ప్రజల్లో ఆందోళ న కలిగిస్తోంది.
ఉత్పత్తిలో ముందంజ
పాల ఉత్పత్తిలో జిల్లా ముందంజలో ఉంది. నిత్యం సుమారు 18 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నా యి. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు సేకరించి మా ర్కెట్‌కు పంపిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు మధ్యవర్తులు రైతుల నుంచి పాలు సేకరించి నేరుగా విక్రయించేస్తున్నారు. ఇక్కడే కల్తీ జరిగే అవకాశముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లతో మొదలై రసాయనాల వరకు..
ఇదివరకు పాలలో నీళ్లతో మాత్రమే కలిపి అమ్మడం జరిగేది. కానీ, ప్రస్తుతం కొందరు అధిక లాభాల కోసం పాలు మరింత చిక్కగా కనిపించేందుకు, రుచి మారకుండా ఉండేందుకు యూరియా, ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాకై ్సడ్, మాల్డోడెక్స్ ట్రిన్, డిటర్జెంట్లు వంటి హానికర పదార్థాలు కలిపేస్తున్నారు. ఇలాంటి కల్తీ పాలు తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తనిఖీలు లేకపోవడంతోనే..
పాల సేకరణ కేంద్రాలు, డెయిరీలు, విక్రయ కేంద్రాలను మిల్క్ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధలను పకడ్బందీగా అమలు కావడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నడు స్తున్న పాల సేకరణ కేంద్రాలపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అలాగే పాలు మాత్రమే కాకుండా వాటి తో తయారయ్యే పెరుగు, మజ్జిగ, పాలపొడి, వెన్న, నెయ్యి, స్వీట్లు, ఐస్‌క్రీమ్, పన్నీర్ వంటి ఉత్పత్తుల్లో కూడా కల్తీ జరిగే అవకాశముందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మిల్క్ యాక్ట్ అమలు కీలకం
ప్రభుత్వం తీసుకొచ్చిన మిల్క్ యాక్ట్ ప్రకారం పాల సేకరణ కేంద్రాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. లేకుంటే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే కల్తీ పాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి.
జిల్లా సమాచారం
పాడి రైతులు 4.20 లక్షలు
పశువులు 5.50లక్షలు
పాల ఉత్పత్తి సుమారు 18లక్షల లీటర్లు


