కాలువలో పడి వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

Mar 6 2026 8:25 AM | Updated on Mar 6 2026 8:25 AM

చిత్తూరు అర్బన్‌: మద్యం మత్తులో.. ప్రమాదవశాత్తు మురుగునీటి కాలువలో పడి చిత్తూరుకు చెందిన హమీద్‌ (48) అనే వ్యక్తి మృతి చెందాడు. టూటౌన్‌ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని కట్టమంచి మార్కెట్‌ యార్డు సమీపంలో ఉన్నర కల్వర్టు వద్ద ఓ మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన టూటౌన్‌ సీఐ నెట్టికంటయ్య విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆప్పత్రికి తరలించారు. మృతుడు చిత్తూరులోని దొడ్డిపల్లె సీసీఎస్‌ కాలనీకు చెందిన జె.హమీద్‌గా గుర్తించారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న హమీద్‌ బుధవారం రాత్రి కల్వర్టుపై కూర్చుని మద్యం తాగి, పొరబాటున కాలువలో పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెల్టు షాపుపై దాడి

– 84 మద్యం బాటిళ్ల స్వాఽధీనం

కార్వేటినగరం: మండలంలోని ఎస్‌ఎన్‌ కండ్రిగ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై దాడి చేసి, 84 మధ్యం బాటిళ్లు స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్‌ ఐ తేజస్విని తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు వెల్లడించారు. బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న సి.షణ్ముగం అనే నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతి

గుడుపల్లె : స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రెడ్డెప్ప(42) గురువారం కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. వివరాలు.. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెకు చెందిన రెడ్డెప్ప కాంట్రాక్టు విధానంలో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం విధి నిర్వహణలో భాగంగా ఒక ఫీడర్‌ నుంచి మరో ఫీడర్‌కు త్రీపేస్‌ కరెంట్‌ను షిఫ్ట్‌ చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. మృతుడి బంధువుల పిర్యాదు మేరకు గుడుపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు

పుత్తూరు : మండలంలోని వేపగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తాపడగా, బస్సు ముందుభాగం పూర్తిగా ఛిద్రమైంది. వివరాలు.. చైన్నె నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడు బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ రోడ్డుపై బోల్తాపడింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయాలపాలైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మందుబాబుల అరెస్ట్‌

శాంతిపురం: మండలంలోని వేర్వేరు చోట్ల బహిరంగంగా మద్యం తాగుతున్న పది మందిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. నిందితులను కుప్పం సెకెండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. మొదటి తప్పుగా భావించిన న్యాయమూర్తి ఈ మేరకు నిందితులను హెచ్చరించి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారని వెల్లడించారు.

దెబ్బతిన్న తమిళనాడు బస్సు

స్తంభించిన ట్రాఫిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement