చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మహిళలకు భద్రతపై అవగాహన అవసరమని ఎస్‌ఐ నాగసౌజన్య సూచించారు. గురువారం చిత్తూరులోని అపోలో కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నుంచి రక్షణపై సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థినులకు భద్రత, హక్కులపై సూచనలు అందించారు. వేధింపులకు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని కోరా రు. ఆన్‌లైన్ వేధింపులు, బ్లాక్ మెయిల్ ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లును ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని కోరారు.


