గంగవరం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. గంగవరం బైపాస్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసింది. గురువారం ఈమేరకు ఆ ప్రమా ద స్థలాన్ని ఎస్పీ తుషార్ డూడీ, డీటీసీ నిరంజన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ప్రమాద సమయంలో కారు వేగం సుమారు 130 కిలోమీటర్లుగా నమోదైనట్టు గు ర్తించారు. ప్రమాద స్థలంలో తక్షణ భద్రతా చర్యలతో పాటు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు కారకమైన రోడ్లలో లోపాలను సరిదిద్దడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదకర ప్రాంతానికి 500మీటర్లు దూరంలో ముందుగానే కనీసం 5 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సరుకు రవాణా వాహనాల వెనుక భాగంలో రేర్ అండర్ రన్ ప్రొటెక్షన్ ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.


