సెక్రటరీలకు పన్ను పోటు | - | Sakshi
Sakshi News home page

సెక్రటరీలకు పన్ను పోటు

Mar 6 2026 8:25 AM | Updated on Mar 6 2026 8:25 AM

● పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్‌ ఇచ్చిన అధికారులు ● గడువులోపు పన్ను వసూలు చేయాలని ఆదేశాలు ● ఇప్పటికే అదనపు విధులతో సతమతమవుతున్న సెక్రటరీలు ● ఒత్తిడిని తట్టుకోలేక రోగాల బారిన పడుతున్న ఉద్యోగులు

లక్ష్యం.. రూ.6.24 కోట్లు!

మండలం వసూళ్లు రూ.లక్షల్లో

ఐరాల రూ.307

వెదురుకుప్పం రూ.36.9

శాంతిపురం రూ.82.5

నిండ్ర రూ.17.5

నగరి రూ.50.6

పెద్దపంజాణి రూ.36.5

ఎస్‌ఆర్‌పురం రూ.35.7

జీడీనెల్లూరు రూ.78.3

గుడిపాల రూ.67.8

పూతలపట్టు రూ.165.3

పలమనేరు రూ.47

పాలసముద్రం రూ.17.5

గుడుపల్లె రూ.33.6 విజయపురం రూ.20.9 చిత్తూరు రూ.25.6 పులిచెర్ల రూ.65.1

కుప్పం రూ.35.8

యాదమరి రూ.76

తవణంపల్లె రూ.79

గంగవరం రూ.78.9

రొంపిచెర్ల రూ.42.8

పెనుమూరు రూ.52.8

కార్వేటినగరం రూ.62.1

బంగారుపాళ్యం రూ.117.9

రామకుప్పం రూ.34.9

వి.కోట రూ.144.8

బైరెడ్డిపల్లె రూ.38.4

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిపై అదనపు భారం మోపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు పన్నుల వసూళ్లపై టార్గెట్‌ విధించింది. ఆరు రోజులు గడువు ఇచ్చి రూ.6.24 కోట్లు వసూలు చేయాలని ఆదేశించింది. లక్ష్యాన్ని నెరవేర్చకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే అదనపు పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు తాజాగా పన్నుపోటుతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 622 పంచాయతీలు ఉన్నాయి. వాటి నుంచి పన్ను లు వసూలు బాధ్యతలను కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఇప్పటికే ఓటర్ల నమోదు, ఫ్యామిలీ యూనిఫైడ్‌ సర్వేతో పాటు ఇతర సర్వేలు అప్పగించింది. ఇప్పు డు పన్నుల వసూలుకు లక్ష్యం విధించింది. ఈ నెల 10వ తేదీలోపు రూ.24.76 కోట్లు వసూలు చేయా లని పేర్కొంది. లక్ష్యం చేరుకోకుంటే చర్యలు తప్ప వని హెచ్చరించింది. వారు ఇప్పటి వరకు దాదాపు రూ.18.52 కోట్లు వసూలు చేశారు.

ఆరు రోజులు రూ..6.24 కోట్లు టార్గెట్‌

తొలుత జిల్లాలోని 622 గ్రామ పంచాయతీల పరంగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఫిబ్రవరి నెలాఖరుకు వసూ లు చేయాలని, లేకపోతే నోటీసులు ఇస్తామని బెదిరించింది. దిక్కుతోచని స్థితిలో కార్యదర్శులు పగ లు, రాత్రి వసూళ్లపై దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌ విధానంలో సాంకేతిక సమస్యలు రావడం, సమయం తక్కువ ఉండడంతో రాష్ట్ర అధికారులు మార్చి 15 వరకు గడువును పొడగించారు. కొత్తగా ఈ నెల 10వ తేదీలోపు మొత్తం పూర్తి చేయాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో కార్యదర్శులు అల్లాడుతున్నారు.

ఇందులో ఐరాల 92 శాతం వసూళ్లతో రూ.3.07 కోట్లు, వెదురుకుప్పం 91 శాతం రూ.36.09 లక్షలు, శాంతిపురం 89 శాతం రూ.74.03 లక్షలు, నగరి 89 శాతం రూ.17.05 లక్షలు, నిండ్ర 86 శాతం రూ.50 లక్షలు, పెద్దపంజాణి 80 శాతం రూ.36.02 లక్షలు, ఎస్‌ఆర్‌పురం 80 శాతం రూ.34.02 లక్షలు, జీడీనెల్లూరు 80 శాతం రూ.71.08 లక్షలు, గుడిపాల 79 శాతం రూ.62.08 లక్షలు, పూతలపట్టు 78 శాతం రూ.1.52 కోట్లు వసూళ్లతో ముందంజలో ఉన్నాయి. అలాగే యాదమరి 70 శాతం రూ.76 లక్షలు, తవణంపల్లె 70 శాతం రూ.79 లక్షలు, గంగవరం 70 శాతం రూ.78.09 లక్షలు, రొంపిచెర్ల 68 శాతం రూ.42.07 లక్షలు, పెనుమూరు 65 శాతం రూ.52.08 లక్షలు, కార్వేటినగరం 64 శాతం రూ.62.01 లక్షలు, బంగారుపాళ్యం 64 శాతం రూ.1.17 కోట్లు, రామకుప్పం 62 శాతం రూ.34.09 లక్షలు, వి.కోట 62 శాతం రూ.1.44 కోట్లు, బైరెడ్డిపల్లె 60 శాతం రూ.38.04 లక్షలతో ఆ తర్వాత స్థానాల్లో ఉంది.

ఓటర్ల నమోదు, సర్వేలతో సతమతం

ఈ నెల 9 లోపు పంచాయతీ ఓటర్ల ముసాయి దా జాబితాను సిద్ధం చేసి ప్రకటించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఫ్యామిలీ యూనిఫైడ్‌ సర్వే, దీంతో పాటు పంచాయతీలో రోజు వారీ విధులు, సచివాలయ సర్వేలతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. నిమిషం తీరికలేకుండా పనిచేస్తున్నా రోజువారీ రిపోర్టులు, వాటిపై సమీక్షలు, పనితీరు మార్చుకోవాలని బెదిరింపులతో ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక షుగర్‌, బీపీ, వయస్సు పైబడిన వారు ఏమిటి ఈ ఖర్మ అనుకుని విధి లేక విధులు నిర్వహిస్తున్నారు.

వసూళ్లు సాధిస్తాం

పన్నుల వసూళ్ల గడువును ప్రభుత్వం పొడిగించింది. గతంలో కంటే ప్రస్తుతం పన్నుల వసూలులో ప్రతిభ చూపుతున్నారు. గడువులోపు మిగిలిన రూ.6.24 కోట్లు లక్ష్యం చేరుకుంటున్నామని భావిస్తున్నాం. ఇతర సర్వేలతో కార్యదర్శులు బిజీగా ఉన్నా, పన్నుల చెల్లింపులపై దృష్టి పెట్టారు. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.

– సుధాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement