అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు | - | Sakshi
Sakshi News home page

అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు

Mar 6 2026 8:24 AM | Updated on Mar 6 2026 8:24 AM

చిత్తూరు కార్పొరేషన్‌ : వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ ఆదేశించారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో ఎంఆర్‌టీ, నిర్మాణ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఆ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు. అలాగే ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈఈలు భాస్కర్‌నాయుడు, బాబు, పాల్గొన్నారు.

కుప్పం : చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యిలా మారింది. ప్రధానంగా కుప్పం డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కుంపటి మీద కూర్చున్నట్లే ఉంటోందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు పనిచేస్తున్నప్పటికీ టెన్షన్లు మాత్రం తప్పడం లేదు. తమ్ముళ్లు గీచిన గీతను దాటకపోయినా ఒత్తిడి, నిందారోపణలు తప్పడం లేదని కుప్పం పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హఠాత్తుగా ఇద్దరికి ట్రాన్స్‌ఫర్‌

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండేళ్ల క్రితం స్థానిక టీడీపీ నేతలు ఏరికోరి జీటీ నాయుడును కుప్పం అర్భన్‌ సీఐగా వేయించుకున్నారు. ఇష్టారాజ్యంగా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అనంతరం ఏమైందో ఏమోగాని హఠాత్తుగా సీఐ జీటీ నాయుడుని వీఆర్‌కు పంపేశారు. అదే తరహాలోనే గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులును సైతం అకస్మాత్తుగా బదలీ చేయించారు.

వారంలో మళ్లీ..

జిల్లావ్యాప్తంగా మరో వారంలో పోలీసుల బదలీ పక్రియ ప్రారంభం కానునంది. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎవరిపై బదిలీ వేటుపడుతుందో అని టెన్షన్‌ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement