చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్రప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ను పక్కాగా ఖర్చు చేసి సకాలంలో బిల్లులు సమర్పించాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. గురువారంచిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీల్లో ఆఫీస్ నిర్వహణ పనులను ఈ నెల 9వ తేదీలోపు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అమలులో భాగంగా ప్రతి పీహెచ్‌సీలో ఓపీ నమోదు, ల్యాబ్ పరీక్షలు, ఫార్మసీ సేవలు తదితర వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. గర్భిణులకు తప్పనిసరిగా ఏబీ హెచ్‌ఏ (అబా) ఐడీ నమో దు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఏ ఐడీతో సహా ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని కోరారు. రీజన ల్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణకు సిబ్బంది వివరాలు పంపించాలన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్ స్పందన శాతం 100కు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డాక్టర్ వెంకట ప్రసాద్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ ప్రవీణ, జార్జ్, శ్రీవాణి, రామ్మోహన్ పాల్గొన్నారు.


