పారిశుద్ధ్యం మెరుగుపడాలి
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఎంపీ నిధులతో జీడీ నెల్లూరు మండలానికి 63 లక్షల విలువలతో 20 ఈ ఆటోలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాలకు కూడా ఈ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, మేయర్ అముద, చూడా చైర్‌పర్సన్ హేమలత, డీపీఓ సుధాకర్ పాల్గొన్నారు.
● ముస్తాబు కార్యక్రమాన్ని సంక్షేమ వసతిగృహాల్లో అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
● పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంపై ఆడిట్ జరపాలని ఆదేశించారు. పీఎంవో, సీఎం, మంత్రుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


