పోలీసు ఉద్యోగం ఉపాధి కాదు.. బాధ్యత
చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగమంటే ఉపాధి మాత్రమే కాదని.. ప్రజల పట్ల బాధ్యతగా ఉంటూ సేవా భావంతో పనిచేయడమని చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ అన్నారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. నాగులు నెలల క్రితం వెలువడ్డ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన 139 మంది అభ్యర్థులకు సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ ప్రారంభమైంది. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ.. సమయపాలన, నిబద్ధతతో పనిచేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ బ్యాచ్‌గా చిత్తూరు అభ్యర్థులు పేరు తెచ్చుకోవాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీలు సాయినాథ్, రాంబాబు, చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ఇన్‌స్పెక్టర్లు అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రశేఖర్, వీరేష్ పాల్గొన్నారు.
కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు రేపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24న నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మమతారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సదుం పోలీస్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు వయోపరిమితి లేదని, 85 కేజీల బరువు లోపు ఉండాలని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28 వరకు కర్నూలు జిల్లా పంచలింగాలలో జరిగే 72వ రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9490005167, 8555046157 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.


