
నిజం నీళ్లకేం తెలుసు?
రాళ్లున్న చోట సిమెంట్ పాలీష్ రాళ్లపై నుంచి ఊడిపోతున్న సిమెంట్ అండర్ పైప్‌లైన్ మార్గాల్లో తప్పని వాటర్ లీకేజీ చెరువులకు మళ్లించే చోట దెబ్బతిన్న సిమెంట్ పనులు
పలమనేరు: కూటమి అబద్ధపు హామీలు.. గారడీ మాటలకు హంద్రీ–నీవా బలైపోతోంది. నాణ్యత లేని పనులు.. నాసిరక నిర్మాణాలతో తనలో ప్రవహించే కృష్ణమ్మను కాపాడలేక అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా లీకేజీలు.. ఏ పక్క చూసినా సీఫేజీలే కనిపిస్తుండడం సర్వసాధారణమైపోయింది. తమ సొత కంపెనీలకు దోచిపెట్టి.. కుప్పానికి నీళ్లు తెప్పిస్తున్నామంటూ సంకలెగరేయడం విమర్శలకు తావిస్తోంది.
గత ప్రభుత్వంలో లైనింగ్ లేకనే!
కుప్పానికి కృష్ణమ్మను అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులేసింది. గంగవరం మండలంలోని పశపత్తూరు, వీకోట మండలంలోని కృష్ణాపురం, రామకుప్పం మండలంలోని ఆదినేపల్లి వద్ద పంప్‌హౌస్‌లు నిర్మించింది. పశపత్తూరు వద్ద 750 కిలోవాట్స్ సామర్థ్యం గల నాలుగు మోటార్ల ద్వారా గంటకు 5,400 క్యూసెక్‌ల నీటిని పంపే 5 వేల కేవీ మోటార్లను ఏర్పాటు చేసింది. దీంతో పాటు నీరు వేగంగా వెళ్లేలా భారీ కంప్రెషర్లు సమకూర్చింది. అప్పట్లోనే పెండింగ్ కాలువ నిర్మాణాలు, స్ట్రక్చర్ నిర్మాణాలు, 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు, 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, మూడు చోట్ల లిఫ్ట్ పనులను పూర్తిచేసింది. కృష్ణా జలాలు కుప్పానికి చేరేలా చర్యలు చేపట్టింది.
ఖాజీపేట వద్ద ఇప్పటికీ సాగుతున్న పనులు
తాతిరెడ్డిపల్లి వద్ద బెబ్బతిన్న సిమెంట్ పనులు
నాసిరకంగా హంద్రీ–నీవా కాలువ పనులు
గొప్పలు.. కూటమికి తిప్పలు?
కూటమి ప్రభుత్వం గత టీడీపీ హయాంలో పనులు చేపట్టిన సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి అంచనాలను పెంచి లైనింగ్ పనులను కేటాయించింది. ఆ మేరకు కుప్పం బ్రాంచి కెనాల్ లైనింగ్ పనులు రూ.161.78 కోట్లు, పుంగనూరు ఉపకాలువ లైనింగ్ కోసం రూ.480 కోట్లను కేటాయించింది. ఈ పనులు దక్కించుకున్న సంస్థ నాసిరకంగానే పనులు చేపట్టింది. కనీసం క్వాలిటీ కంట్రోల్ శాఖ కూడా పట్టించుకోలేదు. దీంతో లైనింగ్ పనులు ఎన్నాళ్లుంటాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

నిజం నీళ్లకేం తెలుసు?

నిజం నీళ్లకేం తెలుసు?