పేద రైతుపై టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్‌ఫోర్సు: పొలం పనులు చేసేందుకు వెళ్లి న పేద రైతు టి.చిన్నరెడ్డెప్ప ఆస్తిపై కన్నేసిన టీడీపీ నాయకులు ఆయన్ని చితకబాది, తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం కంగానెల్లూరు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుడి కుమార్తె టి.శ్యామల పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం మేరకు.. గ్రామానికి సమీపంలో టి.చిన్నరెడ్డెప్పకు సుమారు 88 సెంట్ల పొలం ఉంది. అందులో వ్యవసాయం చే సేందుకు వెళ్లిన టి.చిన్నరెడ్డెప్పపై అదే గ్రా మానికి చెందిన టీడీపీ నాయకులు టి.గంగులప్ప, టి.చెన్నకేశవులు, టి.జయశంకర్ దౌర్జన్యంగా దాడి చేసి గా యపరిచారు. పొలం పనులకు వెళ్లిన ప్రతిసారి గొ డవ చేస్తున్నారని బాధితుడి కుమార్తె ఆవేదన వ్య క్తం చేశారు. కూటమి సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి పలుమార్లు తమపై దాడి చేసి తన తండ్రి చిన్నరెడ్డెప్ప, తల్లి శంకరమ్మను కొట్టి గాయపరిచిన్నారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలం వివాదమై కోర్టులో కేసు సైతం వేసినట్లు చె ప్పింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నరెడ్డెప్ప ను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స చేయి స్తున్నారు. ఫిర్యాదులో పేరొన్న కూటమి నేతల వా రి కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబానికి ప్రా ణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కోరింది.


