
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్‌ఎల్‌వీని అభివృద్ధి
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆర్బిటల్ రీ–ఎంట్రీ ఎక్స్‌పరిమెంట్ డిప్లాయిబుల్ లాండింగ్ గేర్(ఆర్‌ఎల్‌వీ)ను అభివృద్ధి చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్, విక్రమ్ సారాభాయ్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్, ఐఐఎస్‌యూ డైరెక్టర్ పద్మకుమార్ సమక్షంలోని ల్యాండింగ్ గేర్ డ్రాప్ టెస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. విమానం తరహాలో రెక్కలు కలిగిన పునర్వినియోగ లాంచింగ్ వెహికల్ పుష్పక్ కోసం డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టం పరీక్ష అర్హత కోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో అత్యాధునిక ల్యాండింగ్ గేర్ డ్రాప్ట్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. అయితే పుష్పక్ వాహనం ఆరోహణ క్రమంలో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కొన్ని కక్ష్యల తరువాత పుష్పక్ వాతావరణంలోకి ప్రవేశించి డిప్లాయిబుల్ ల్యాండింగ్ గేర్ సిస్టంను ఉపయోగించి రన్‌వేపై ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ డ్రాప్ సౌకర్యానికి టెలిస్కొపిక్, ఆర్టిక్యులేటెడ్, సెమీ ఆర్టిక్యులేటెడ్ వంటి వివిధ రకాల ల్యాండింగ్ గేర్‌లను పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. తారు, కాంక్రీట్, పొడి, తడి, మంచుతో నిండిన ఉపరితలాల వంటి విభిన్న రన్‌వేలపై ల్యాండింగ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమగాములను పంపి, తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయోగాత్మక పరీక్షలను చేస్తున్నామని కూడా ఇస్రో తెలియజేసింది. అధునాతనమై ఆర్‌ఎల్‌వీలు, విమాన సాంకేతికతల అభివృద్ధి అర్హతను వేగవంతం చేసే సామర్థ్యాన్ని ఇస్రో కలిగి వుంది.