మన పుత్తూరు పేరిట సామాజిక సేవలను విస్తృతం చేయడమే మా లక్ష్యం. మన పుత్తూరు టీమ్‌ను నా మిత్రులు పవన్‌కుమార్, సాయిగౌతమ్, కల్యాణ్‌కుమార్, కృష్ణచైతన్యలతో కలిసి నడిపిస్తున్నా. అందరం ఇంజినీరింగ్ చదివేప్పుడు మిత్రులమయ్యాం. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నా మన పుత్తూరుకు తగిన సమయం కేటాయిస్తున్నాం. పలానా చోట మీ సేవ అవసరం అని మా దృష్టికి తీసుకు వస్తే తప్పుకుండా మావంతు పనిచేస్తాం. ఇందుకు మా టీమ్ అన్ని వేళలా సిద్ధం. ప్రధానంగా పుత్తూరు గురించి గుగూల్ మ్యాప్స్, నెట్‌లోనే కాకుండా మా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూస్తే ఇక్కడి ప్రత్యేకతలు తెలిసేలా ప్రయత్నిస్తున్నాం.
– గిరీష్ కుమార్, మన పుత్తూరు టీమ్ అడ్మిన్