పుంగనూరులో నల్లారి ప్లాప్‌ షో | Sakshi
Sakshi News home page

పుంగనూరులో నల్లారి ప్లాప్‌ షో

Published Tue, Apr 23 2024 8:30 AM

బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా వెళ్లిపోతున్న జనం  - Sakshi

కూటమి అభ్యర్థుల సభకు జనం కరువు

తెలుగుదేశం నేతల కోడ్‌ ఉల్లంఘన

బాణసంచా హోరు జనాలకు మద్యం

గంటల కొద్దీ జనం కోసం..

టీడీపీ అభ్యర్థి చల్లాబాబు బాలాజీ థియేటర్‌ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానాతంటాలు పడ్డారు. పలువురు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచా భారీ ఎత్తున కాల్చారు. అలాగే డీజే పాటలు, డ్యాన్స్‌లతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. ర్యాలీకి వచ్చిన అద్దె జనానికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండా అక్కడే పడేసి వెళ్లడం కనిపించింది.

పుంగనూరు: కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సోమవారం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చా రు. డీజేపాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా తాగించారు. ఆపై భోజనం రుచిగా లేదంటూ అద్దెజనం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కట్టుకథల కిరణ్‌

కూటమి అభ్యర్థుల సభ జనం లేక వెలవెలబోయింది. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్లి పోతుండడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి మైకు అందుకుని మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన పలు విమర్శలు చేశారు. పాల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేంటి కిరణ్‌ ఇలా మాట్లాడుతున్నారంటూ గుసగుసలాడడం కనిపించింది.

రూ.300, క్వార్టర్‌

అద్దె జనానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆయా పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్‌ బాటిల్‌, బిరియానీ అందజేశారు. మద్యం షాపుల వద్ద టీడీపీ జెండాలు చేతబట్టిన కార్యకర్తలు కిక్కిరిసిపోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement