బంగారుపాళెం: మండలంలోని తుంబపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేసిన క్రీడా పరికరాలను శనివారం మండల టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. నలగాంపల్లెకు చెందిన ఎన్‌ఆర్‌ఐ విక్రమ్ పాఠశాలకు క్రీడా పరికరాలు అందించేందుకు వచ్చారు. వారి వెంట స్థానిక టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అదే సమయంలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ విషయం తెలుసుకుని పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా పాఠశాలలో క్రీడా పరికరాల పంపిణీకి ఎలా అనుమతిస్తారని హెచ్‌ఎంను ప్రశ్నించారు. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. మండల టాస్క్‌ఫోర్స్ అధికారులు తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో శివశంకర్ ఉపాధ్యాయులను విచారించారు. క్రీడాపరికరాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.