
మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ కాలనీలో సోమవారం వార్షిక ప్రణా ళిక, బడ్జెట్ అంశాలపై వార్షిక ప్రణాళిక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమ గ్ర శిక్ష శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కార్యక్రమాలు, పథకాలపై 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఈ వర్క్‌షాప్‌న కు ఎంపిక చేసిన మండల స్థాయి కోర్ బృందాలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
పీఆర్ చట్టంపై
అవగాహన అవసరం
చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీరాజ్(పీఆర్) చట్టంపై అవగాహన అవసరమని జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో డీఎల్‌పీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పంచా యతీరాజ్ సేవలపై అవగాహన సదస్సు ని ర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను సులభతరం అయ్యిందని చెప్పారు. గ్రామపాలనలో పంచాయతీ కార్యదర్శుల పా త్ర కీలకమన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థా యి అధికారుల వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలన్నారు. పల్లెపాలన పరంగా జీఓ, మెమో, సర్కులర్, రూల్ పొజిషన్, బేసిక్స్‌పై అవగాహన అవసరమని డీపీఓ లక్ష్మి తెలిపారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలను అందించడంతోపాటు పన్నుల వసూళ్లపై కార్యదర్శులు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్సీ డీసీ షణ్ముగం, డీఎల్‌పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ బిల్డింగ్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 70,686 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 34,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.02 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది.
సీఎం పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు
రేణిగుంట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో క లిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మా ట్లాడుతూ ఈ నెల 21వ తేదీన సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం మాంబట్లు అ పాచీ పరిశ్రమ సమీపంలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉద యం 9.45 గంటలకు ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. 10.20కి హెలికాప్టర్‌లో బయలుదేరి మాంబ ట్టు వద్ద హెలీప్యాడ్‌కు 10.45 గంటలకు వెళతా రని తెలిపారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించి, 12.40 గంటలకు బయలుదేరి, రేణిగుంట వి మానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు.