రష్యాలో స్తంభించిన యూట్యూబ్‌.. యూజర్ల గగ్గోలు | Youtube Massive Glitch Reported In Russia Thousands Affected | Sakshi
Sakshi News home page

రష్యాలో స్తంభించిన యూట్యూబ్‌.. యూజర్ల గగ్గోలు

Published Thu, Aug 8 2024 4:59 PM | Last Updated on Thu, Aug 8 2024 5:24 PM

Youtube Massive Glitch Reported In Russia Thousands Affected

వీడియో హోస్టింగ్ సైట్ యూట్యూబ్‌లో ప్రపంచంలో ఎక్కోడో చోట అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం రష్యాలో యూట్యూబ్‌ సేవలు స్తంభించాయి. దీంతో యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. యూట్యూబ్ లభ్యతలో వేలాది అవాంతరాలను రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీసెస్‌ కూడా నివేదించింది.

రష్యాలో యూట్యూబ్‌కు సంబంధించి వేలకొద్దీ అవాంతరాలు నమోదయ్యాయని రష్యన్ ఇంటర్నెట్ మానిటరింగ్ సర్వీస్ Sboi.rf తెలిపింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల (VPNలు) ద్వారా మాత్రమే యూట్యూబ్‌ని యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతోందని యూజర్లు పేర్కొన్నారు.

రష్యాలోని రాయిటర్స్ రిపోర్టర్లు కూడా యూట్యూబ్‌ని యాక్సెస్ చేయలేకపోయారు. అయితే కొన్ని మొబైల్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. యుట్యూబ్‌ డౌన్‌లోడ్ వేగం ఇటీవల గణనీయంగా తగ్గింది. యూట్యూబ్‌ అంతరాయంపై దాని యజమాన్య సంస్థ ఆల్ఫాబెట్‌ను రష్యన్ చట్టసభ సభ్యులు నిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement