వింటే ఆశ్చర్యపోతారు! కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం!

Woman STD 5.2 million in damages vehicle insurance company  - Sakshi

సవాలక్ష కారణాలు చెప్పి బీమా ఎగ్గొట్టే ఇన్సెరెన్సు కంపెనీలు ఓ వైపు ఉంటే కట్టిన ప్రతీ పైసాకు అవసరంలో లెక్కకట్టి బీమా చెల్లించే సంస్థలు మరికొన్ని కొన్ని ఉంటాయి. కానీ అమెరికాలో ఇటీవల ఓ బీమా సంస్థ నష్టపరిహారంగా చెల్లించిన విధానం నఃభూతో నఃభవిష్యత్‌ అన్నట్టుగా నిలిచింది. 

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన మహిళ ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. 2017లో ఓ రోజు అతనికి చెందిన కారులో ఆ మహిళ తన పార్ట్‌నర్‌తో శృంగారంలో పాల్గొంది. అయితే ఈ వ్యక్తికి హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) అనే సుఖవ్యాధి ఉంది. ఆ కారులో జరిగిన శృంగారం కారణంగా సదరు మహిళకు ఆ సుఖవ్యాధి సంక్రమించింది. ఈ వ్యాధి కనుక ముదిరితే క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. 

కారులో కాబట్టి
కారులో జరిగిన శృంగారం కారణంగానే తనకు ప్రమాదకర సుఖవ్యాధి సంక్రమించినందున తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తనకు ఏకంగా రూ.77.36 కోట్లు ( 9.9 మిలియన్‌ డాలర్లు) పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

డ్యామెజెస్‌ అండ్‌ ఇంజ్యూరీస్‌ 
సుదీర్ఘ కాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం కారు ఇన్సెరెన్సుకు సంబంధించి డ్యామెజెస్‌ అండ్‌ ఇంజ్యూరీస్‌ క్లాజ్‌ ఆధారంగా బాధితురాలికి రూ.40.83 కోట్లు  (5.2 మిలియన్‌ డాలర్లు) పరిహారంగా ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చారు. సదరు వ్యక్తి తనకు సుఖరోగం ఉన్న విషయం దాచిపెట్టి ఉద్దేశ పూర్వకంగా కారులో ఆ తప్పుకు పాల్పడినట్టు కోర్టు భావించింది. దీంతో బాధితురాలి పక్షాన నిలబడి.. కారులో ప్రయాణిస్తుండగా దాని యజమాని వల్ల జరిగిన ప్రమాదంగా పరిగణిస్తూ... డ్యామెజెస్‌ అండ్‌ ఇంజ్యూరీస్‌ క్లాజ్‌ బీమా చెల్లించాలంటూ తీర్పు వెలువరిచింది.

అందుకేనా ?
మిసోరీ కోర్టు తీర్పుపై భిన్నరకాలైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రమైన డ్యామేజెస్‌కి పరిహారం ఇవ్వాల్సి రావడం వల్లే కారు ఇన్సెరెన్సులు ఇంతగా పెరిగాయి అంటూ ఎలాన్‌ మస్క్‌ సైతం ఈ తీర్పుపై స్పందించాడు. మరి ఇన్సెరెన్సు కంపెనీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

చదవండి: 40 ఏళ్ల తర్వాత అమెరికాలో గడ్డు రోజులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top