Sakshi News home page

Budget 2024-25: ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?

Published Fri, Jan 26 2024 4:42 PM

Will The Govt Allot Sufficient Funds To Export Industry In Budget 2024 - Sakshi

దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్‌లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మార్కెటింగ్‌ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని తెలిపాయి. ఎగుమతులకు అనుగుణంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నట్లు తెలియజేసింది.

ఈ క్రమంలోనే ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంలో ఓ గ్లోబల్‌ షిప్పింగ్‌ లైన్‌నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు వ్యయభారం తగ్గనుందని చెప్పాయి. 2021లో ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌ చార్జీలో భాగంగా 80 బిలియన్‌ డాలర్లకుపైగా చెల్లించాల్సి వచ్చేదని, 2030 నాటికి ఇది 200 బిలియన్‌ డాలర్లను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) పేర్కొంది.

చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్‌ దేశాల కంటే ఆర్‌అండ్‌డీపై భారత్‌ పెడుతున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇది దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉందని ఎఫ్‌ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్‌ అహ్మద్‌ అన్నారు. 

ఇదీ చదవండి: ఇకపై మృదువైన రోబోలు..

అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు మరింత చేరువయ్యేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కావాలని, మార్కెట్‌ యాక్సెస్‌ ఇనీషియేటివ్‌ (ఎంఏఐ) స్కీం కింద బడ్జెట్‌లో మరిన్ని నిధులను కేటాయించాలని అహ్మద్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్‌తో దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్‌ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement