'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్‌లో.. | Why Hide Salaries Entrepreneur Ankur Warikoo Tweet Viral | Sakshi
Sakshi News home page

'జీతం విషయం ఎందుకు దాచాలి?': నా స్టార్టప్‌లో..

Nov 22 2025 9:06 PM | Updated on Nov 22 2025 9:13 PM

Why Hide Salaries Entrepreneur Ankur Warikoo Tweet Viral

సాధారణంగా జీతాల విషయాలు ఎవరూ బయటపెట్టడానికి లేదా వెల్లడించడానికి ఇష్టపడరు. కానీ ఎందుకు జీతాలను దాచిపెట్టాలి? అని వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్, రచయిత అయిన 'అంకుర్ వారికూ' (Ankur Warikoo) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

జీతానికి సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల.. మీరు పనిచేసే ప్రదేశంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇది కొందరిలో అభద్రతను పెంచుతుంది. కాబట్టి బయటకు వెల్లడించ వచ్చు. ఇది మీ క్రమశిక్షణను తెలియజేస్తుందని అంకుర్ వారికూ పేర్కొన్నారు.

ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి కాదు
వ్యక్తిగత ఆర్థిక ప్రపంచంలో నాకు గుర్తింపు రావడానికి కూడా క్రమశిక్షణతో ఉండటం, డబ్బును ఎప్పుడూ వ్యక్తిగతంగా పరిగణించకపోవడమే అని అంకుర్ అన్నారు. నేను కేవలం జీతం మాత్రమే కాకుండా.. నా ఆదాయం, పెట్టుబడి, నేను చేసే పొరపాట్లను కూడా బహిరంగంగా చెబుతాను. ఇది ఎవరినో ఆకట్టుకోవడానికి మాత్రం కాదు. మీరు కొన్ని విషయాలను దాచిపెట్టడం మానేస్తే.. స్పష్టత ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.

జీతాల విషయంలో కంపెనీలే పక్షపాతం చూపిస్తాయి. అలాంటప్పుడే చాలామంది తన జీతాల విషయాన్ని రహస్యంగా దాచేస్తారు. ఇలాంటిది నా స్టార్టప్‌లో జరగదు. అందరి జీతం పబ్లిక్‌గా ఉంటుందని ఆయన అన్నారు. జీతాల విషయంలో అందరికీ ఒక స్పష్టత ఇస్తామని కూడా వెల్లడించారు.

ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

పారదర్శకత పట్ల తన నిబద్ధతను హైలైట్ చేస్తూ.. వారికూ గతంలో తన డ్రైవర్ ఒక నెలలో ఎంత సంపాదిస్తాడో మరియు అతని జీతం ఎలా అభివృద్ధి చెందిందో వెల్లడించారు. మరో ఐదారు సంవత్సరాల్లో.. డ్రైవర్ జీతం నెలకు లక్ష రూపాయలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని తన ట్వీట్ ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement