వినియోగదారులను మోసపుచ్చేలా, తప్పుదోవ పట్టించే సమాచారం, అసమంజస వాణిజ్య విధానాలకు (డార్క్ ప్యాటర్న్స్) తమ ప్లాట్‌ఫాంలలో తావు లేదంటూ 26 టాప్ ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) వెల్లడించింది.
ఇలాంటి ధోరణులను గుర్తించేందుకు, తొలగించేందుకు సదరు సంస్థలు అంతర్గతంగా లేదా బైటి ఏజెన్సీలతో ఆడిట్ నిర్వహించాయని పేర్కొంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచి్చన సంస్థల జాబితాలో జెప్టో, బిగ్‌బాస్కెట్, జొమాటో మొదలైనవి ఉన్నాయి. ఇతర ఈ–కామర్స్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, యాప్ డెవలపర్లు కూడా నిబంధనలను పాటించడంపై దృష్టి పెట్టాలని సీసీపీఏ సూచించింది. డార్క్ ప్యాటర్న్స్ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.


