వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఎందుకివ్వాలి: రామకృష్ణ | Ap Cpi Leader Ramakrishna Comments On TTD Declaration Issue | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఎందుకివ్వాలి: రామకృష్ణ

Sep 27 2024 8:37 PM | Updated on Sep 27 2024 9:04 PM

Ap Cpi Leader Ramakrishna Comments On TTD Declaration Issue

సాక్షి,హైదరాబాద్‌: వెంకటేశ్వర స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం తగదని, స్వామి వద్దకు అందరూ వెళ్లొచ్చని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ విషయమై రామకృష్ణ శుక్రవారం(సెప్టెంబర్‌27)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు. తిరుమలకు జగన్‌ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భార్య క్రిస్టియన్‌ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడు. నాడు వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

వైఎస్‌ జగన్‌ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశం. అప్పుడు ఏమీ మాట్లాడకుండా నేడు సాధారణ భక్తునిలా వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్‌ అడగడమేంటి’అని రామకృష్ణ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు..అబద్ధాలు బట్టబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement