సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి. విజయాలు సిద్ధించాలి. సమృద్ధిగా వానలు కురిసి.. పంటలు బాగా పండి.. రైతులకు మేలు కలగాలి.
సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ తన సందేశంలో అభిలషించారు.


