భలే భలే..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు | Whatsapp Will Also Allow Users Share Voice Notes As Status Updates | Sakshi
Sakshi News home page

భలే భలే..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు

Nov 27 2022 6:21 PM | Updated on Nov 30 2022 10:31 AM

Whatsapp Will Also Allow Users Share Voice Notes As Status Updates - Sakshi

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కొత్త కొత్త అప్‌డేట్‌లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. 

వినియోగదారులు ఇప్పటి వరకు వారి వాట్సాప్‌ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్‌ చేసే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో వాయిస్‌ నోట్‌ను సైతం వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్‌ అప్‌డేట్స్‌ ఇచ్చే వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. 

యూజర్లు స్టేటస్‌లో టెక్ట్స్‌తో పాటు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఫోన్‌ వాట్సాప్‌ కీబోర్డులో టెక్ట్స్‌ టైప్ చేసే ఐకాన్‌ కింద భాగంలో మైక్రోఫోన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే వాయిస్‌ చెప్పొచ్చని, అదే వాయిస్‌ను స్టేటస్‌గా పెట్టుకోవచ్చని వాట్సాప్‌ బీటా ఇన్ఫో వెల్లడించింది. 

దీంతో పాటు వాట్సాప్‌ కాల్స్‌ ట్యాబ్‌ను డెస్క్‌టాప్ వెర్షన్‌ తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది వినియోగంలోకి వస్తే యూజర్లు ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ నుండి నేరుగా కాల్స్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ యాప్‌లో కాల్ హిస్టరీ, కాల్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌ ఉండగా.. త్వరలో యూజర్లందరికి వినియోగంలోకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement