బెల్ట్‌ తొడుక్కుంటే.. ఎండలో హాయిగా తిరుగొచ్చు

Wearable Air Conditioning Belt Sparkle Tornado Review - Sakshi

ఎండాకాలం బయటకు అడుగు పెట్టాలంటే కష్టమే! ఎండలు మండిపడుతున్నప్పుడు వీథుల్లోకి వెళితే ఒళ్లంతా వేడెక్కి, ముచ్చెమటలతో తడిసి ముద్దయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎండలు భగభగమని మండిపడుతున్నా, బయటకు వెళ్లాలంటే ఇదివరకటి కాలంలో గొడుగులు ఉపయోగించేవారు. గొడుగులు తల మీద కాస్తంత నీడనివ్వగలవేమో గాని, ఒంటికి చల్లదనాన్ని ఇవ్వలేవు. 

అయితే, ఈ ఫొటోలోని వ్యక్తి తొడుక్కున్న బెల్ట్‌లాంటిది మీరూ తొడుక్కుంటే, ఎండలో కూడా హాయిగా బయట వ్యాహ్యాళికి వెళ్లొచ్చు. ఎందుకంటే, ఇది ఏసీ బెల్ట్‌. కెనడా కంపెనీ ‘స్పార్కల్‌ టీమ్‌’ దీనిని రూపొందించింది. ‘స్పార్కల్‌ టోర్నడో’ పేరిట రూపొందించిన ఈ బెల్ట్‌ చుట్టూ ఐదు ఫ్యాన్లు ఉంటాయి. ఇది 12 వోల్టుల రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాన్లు చప్పుడు చేయకుండా తిరుగుతూ, 500 మిల్లీమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఉన్న గాలిని చల్లబరుస్తాయి. 

ఇవి నిమిషానికి 583 లీటర్ల గాలిని చల్లబరుస్తూ, ఒంటికి వేడి సోకకుండా రక్షణనిస్తాయి. ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేసుకుంటే, మూడుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. మూడుగంటల కంటే ఎక్కువసేపు బయట ఎండలో గడపాల్సి వస్తే, పవర్‌బ్యాంక్‌ను వెంట తీసుకుపోవడం ఉత్తమం! ‘స్పార్కల్‌ టీమ్‌’ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా దీని ఉత్పత్తి చేపట్టనుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

చదవండి👉 ట్విటర్‌ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసల వర్షం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top