ట్విటర్‌ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసల వర్షం! | New Twitter Ceo Linda Yaccarino Build Twitter 2.0 | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసల వర్షం!

May 14 2023 8:41 AM | Updated on May 14 2023 8:53 AM

New Twitter Ceo Linda Yaccarino Build Twitter 2.0 - Sakshi

ట్విటర్‌ సీఈవోగా లిండా యక్కరినో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తును సృష్టించే మస్క్‌ నుంచి తానెంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆ ప్రేరణే ట్విటర్‌ భవిష్యత్‌ను మార్చేందుకు దోహదపడుతుందని అన్నారు. 

గత అక్టోబర్‌లో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. నాటి నుంచి సీఈఓగా మస్క్ కొనసాగుతూ వచ్చారు. తాజాగా,  లిండాను ట్విటర్‌ సీఈవోగా నియామకాన్ని పరోక్షంగా ప్రకటించారు. అయితే ట్విటర్‌ సీఈవోగా మస్క్‌ తనని నియమించనున్నారంటూ నివేదికలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో లిండా తొలిసారి మాట్లాడారు. 

‘ఉజ్వలమైన భవిష్యత్తును సృష్టించేలా మస్క్ నుంచి ప్రేరణ పొందాను. ఈ విజన్‌ను ట్విటర్‌లో కొనసాగించేలా, వ్యాపారాన్ని కలిసి మార్చడంలో సహాయ చేయడంలో సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఎన్‌బీసీ యూనివర్సల్‌కు అడ్వర్టైజింగ్ చీఫ్‌గా లిండా సుధీర్ఘకాలంగా పనిచేశారు. ఆ సంస్థలో అడ్వర్టైజింగ్‌ విభాగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నానని, ట్విట్టర్ 2.0ని రూపొందించడానికి యూజర్ ఫీడ్‌బ్యాక్ చాలా కీలకమని అన్నారు.

చదవండి👉 ఎవరీ లిండా? ట్విటర్‌ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement