వోల్వో కార్ ప్రియులకు షాక్.. జనవరి నుంచి ప్రైస్ హైక్

Volvo Price Hike In 2024 January - Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) 2024 ప్రారంభం (జనవరి) నుంచి తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండు శాతం ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా.. అస్థిర విదేశీ మారకపు రేట్లు కారణంగా ధరలను పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ధరల పెరుగుల ప్రకటించిన కంపెనీలలో వోల్వో మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలు ఉన్నాయి.

వోల్వో కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో సీ40 రీఛార్జ్, XC40, XC40 రీఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేస్తున్న కార్లు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహన ప్రియులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి

ధరల పెరుగుదల గురించి వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులకు భరించడానికి ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top