వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!

Volvo Car hikes price  its petrol hybrid models - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ వోల్వో కార్‌ ఇండియా మైల్డ్‌ హైబ్రిడ్‌ మోడళ్లపై 2 శాతం వరకు ధర పెంచింది.   ఫలితంగా  మోడల్‌ని  బట్టి 50వేల రూపాయల నుంచి 2 లక్షల దాకా భారం పడనుంది.  ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ సవరించిన నేపథ్యంలో పెరిగిన ముడిసరుకు వ్యయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

దీని ప్రకారం ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎస్‌90,ఎక్స్‌సీ90 వేరియంట్ల ధరలు అధికం కానున్నాయి. బెంగళూరు ప్లాంటులో ఈ మోడళ్లను కంపెనీ అసెంబుల్‌ చేస్తోంది. 

(ఇదీ చదవండిఆన్‌లైన్‌ షాపింగ్‌:లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మ తిరిగిందంతే!)

ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన ఫలితంగా  హైబ్రిడ్‌ల ధరలు స్వల్పంగా పెరిగాయని వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం, సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్స్ సుంకం 30 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి (SWS) రద్దు అయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top