మెరుగైన సేవలపైనే వొడాఫోన్‌ దృష్టి.. | Vodafone Idea maintain focus on offering quality services to users | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలపైనే వొడాఫోన్‌ దృష్టి..

Aug 6 2021 1:45 AM | Updated on Aug 6 2021 1:45 AM

Vodafone Idea maintain focus on offering quality services to users - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా తాజాగా తమ ఉద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నాల్లో ఉంది. కంపెనీపై వస్తున్న వార్తలను పక్కన పెట్టి కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, మార్కెట్లో దీటుగా రాణించేందుకు కృషి చేయాలని ఉద్యోగులకు అంతర్గతంగా కంపెనీ సీఈవో రవీందర్‌ టక్కర్‌ సూచించారు. టాప్‌ స్థాయిలో చోటుచేసుకున్న నాయకత్వ మార్పుల గురించి వారికి వివరించారు. కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదా నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకోవడం, సంస్థను నిలబెట్టే క్రమంలో దాన్ని ప్రభుత్వానికి లేదా ఇతర కంపెనీకి అప్పగించేందుకు సిద్ధమంటూ ప్రకటించడం తదితర పరిణామాలు తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement