
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్‌గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న.. ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పరిసరాల్లో రూ. కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ కథనంలో విజయ్ దేవరకొండ లగ్జరీ కార్లు, నెట్‌వర్త్ వంటి ఆసక్తికరమైన విషయాలు చూసేద్దాం..
విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం (Vijay Deverakonda Car Collection)
ఫోర్డ్ మస్టాంగ్: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 75 లక్షలు ఉంటుందని సమాచారం
మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ: భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. కంపెనీకి చెందిన జీఎల్‌సీ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. ఇతర కార్లకంటే కూడా విజయ్ ఈ కారునే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
వోల్వో ఎక్స్‌సీ 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు.. వోల్వో ఎక్స్‌సీ 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.
రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.
బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి.
నెట్‌వర్త్ (Net Worth) విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కేవలం ఒక నటుడుగా మాత్రమే కాకుండా.. కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవరిస్తున్నారు. దీంతో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈయన నెట్‌వర్త్ మొత్తం రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.
విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్‌మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గిఫ్ట్‌గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?