వోడాఫోన్‌ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..! | Vi Rs 449 Prepaid Plan Now Offers 4gb Data Daily Free Zee5 Premium Subscription | Sakshi
Sakshi News home page

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..!

Aug 9 2021 7:59 PM | Updated on Aug 9 2021 8:00 PM

Vi Rs 449 Prepaid Plan Now Offers 4gb Data Daily Free Zee5 Premium Subscription - Sakshi

వోడాఫోన్‌ ఐడియా (వీఐ) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. వీఐ నెట్‌వర్క్‌ తన కస్టమర్ల కోసం సరికొత్త రివైజ్‌డ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రివైజ్‌డ్‌ ప్లాన్‌లో భాగంగా డబుల్‌ డేటాతో పాటుగా, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందించనుంది. అంతేకాకుండా రాత్రివేళ్లలో 12 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు నైట్‌ ఫ్రీ డేటాను కూడా ఇవ్వనుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా నిర్ణయించింది. వీఐ  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.449ను రివైజ్‌ చేసింది.

ప్రస్తుతం ఉన్న యూజర్లు వేరే నెట్‌వర్క్‌లకు పోర్ట్‌ అవ్వకుండా ఉండటం కోసం వీఐ ఈ ప్లాన్‌ రివైజ్‌ చేసింది. అంతకుముందు వీఐ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.449 ద్వారా కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందించేది. తాజాగా వోడాఫోన్ ఐడియాలో బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి కుమార మంగళం బిర్లా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వోడాఫోన్‌ ఐడియా సంస్థ తమ ఉద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నాల్లో ఉంది. కంపెనీపై వస్తున్న వార్తలను పక్కన పెట్టి కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, మార్కెట్లో దీటుగా రాణించేందుకు కృషి చేయాలని ఉద్యోగులకు అంతర్గతంగా కంపెనీ సీఈవో రవీందర్‌ టక్కర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement